కరోనా తరువాత దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తృతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతీ స్టార్ హీరో డైరెక్టర్ భారీ పాన్ ఇండియా లెవెల్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు డైరెక్టర్లు చిన్న చిన్న హీరోలతో కాకుండా బిగ్ స్టార్స్ తో సినిమాలకు రెడీ అవుతున్నారు. కొంత మంది టైర్ టు హీరోలతో క్రేజీ సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరి కొంత మంది దర్శకులు క్రేజీ స్టార్ లతో పాన్ ఇండియా మూవీస్ చేయడానికే ప్రధాన్యత నిస్తున్నారు.
ఇందులో భాగంగానే నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని స్టార్ హీరో తల అజిత్ తో చేయాలని రెడీ అయిపోయాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేశారు.
అజిత్ 62వ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకురావాలనుకున్నారు. అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. త్వరలో సె పైకి వెళ్లడమే అని అన్నారు. నయనతో పెళ్లి పిల్లలు ఇలా హ్యాపీగా సాగుతున్న విఘ్నేష్ కెరీర్ అజిత్ ప్రాజెక్ట్ తో తరువాతి లెవెల్ కి చేరడం ఖాయం అనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే అజిత్ ప్రాజెక్ట్ విఘ్నేష్ శివన్ చేజారింది. దీంతో భారీ అంచనాలు పెట్టుకున్న విఘ్నేష్ శివన్ కు ఒక్కసారిగా అజిత్ షాకిచ్చాడట. కథలో మార్పులు చేర్పులు చేయాలని అజిత్ చెప్పినా విఘ్నేష్ శివన్ అందుకు అంగీకరించలేదట. దీంతో ఈ స్టోరీ కాకుండా మరో స్టోరీతో సినిమా చేద్దామని అజిత్ చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త కథ అంటే ఇప్పుడు కుదరదు. కాస్త టైమ్ కావాలి. అందుకే 62వ మూవీని మరో దర్శకుడు మగిళ్ తిరుమేనితో చేస్తానని 63వ ప్రాజెక్ట్ ని విఘ్నేష్ శివన్ తో చేస్తానని అజిత్ మాటిచ్చారట. ఇదిలా వుంటే అజిత్ 62వ మూవీని మగిళ్ తిరుమేని అనే దర్శకుడితో ప్రారంభించబోతున్నారని తెలిపింది. ఫిబ్రవరి రెండవ వారంలో ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.