ఈరోజు సాయంత్రం కీలక సమావేశం
హాస్యానికి మారుపేరైనా అల్లు రామలింగయ్య తనయుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నిర్మాతగా సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్న అల్లు అరవింద్ ఏమిటి.. విల్లు సంధించడం ఏమిటి అనుకుంటున్నారా.. అవునండి ఆయన ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
ఇంతకు విషయం ఏమిటంటే.. నిన్న ఆదివారం నాడు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇది కూడా సాంఫీుక మాధ్యమాల వేదికగా చెప్పారు. పరశురామ్, విజయ్ మళ్ళీ ఇంకో సినిమా కోసం కలుస్తున్నారు అని, ఈసారి నిర్మాత దిల్ రాజు కోసం అని వార్తలు కూడా వెలువడ్డాయి. వీళ్ళిద్దరూ ఇంతకు ముందు ‘గీత గోవిందం’ అనే సూపర్ హిట్ సినిమా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. ఇంతవరకు బాగానే వుంది, కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడిరది.
దర్శకుడు పరశురామ్, మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ తరువాత గీత ఆర్ట్స్‌కి ఒక సినిమా చెయ్యాల్సి వుంది. ఎందుకంటే అల్లు అరవింద్ ‘గీత గోవిందం’ షూటింగ్ జరుగుతూ ఉండగానే పరశురామ్ కి అడ్వాన్స్ ఇచ్చారు అని తెలిసింది. ‘సర్కారు వారి పాట’ చేక గీత ఆర్ట్స్ కి చేస్తాను అని పరశురామ్ ఒప్పుకున్నాడు అని ఒక వార్త నడుస్తోంది. అయితే ఇప్పుడు సడెన్ గా పరశురామ్, నిర్మాత దిల్ రాజుకి సినిమా చేస్తా అనటం అల్లు అరవింద్ కి నచ్చలేదు. అందుకని ఈ విషయం మీద గట్టిగా మాట్లాడటానికి ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమావేశం లో పరశురామ్ మీద, దిల్ రాజు మీద అల్లు అరవింద్ గట్టిగా బాణాలు సంధిచే అవకాశం వుంది అని అంటున్నారు. మరి కొద్దీ గంటల్లో ఏ విషయం అనేది తేలనుంది.