ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియందికాదు. ఈ సినిమా గత ఏడాది మార్చి 24న విడుదలై కలెక్షన్స్ పరంగానే కాకుండా రివార్డ్‌లు అవార్డ్‌ల పరంగా అదరహో అనిపిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ మార్చి 12న లాస్ ఎంజెల్స్‌లో జరుగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరింది. అందులో భాగంగా ఈ ఈవెంట్‌ను అటెండ్ అవ్వడానికి రామ్ చరణ్ అమెరికా బయల్దేరి వెళ్లారు.