స్టాక్‌హోమ్‌లో నెవాక్-ఢిల్లీ ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్
ఎయిరిండియా విమానం న్యూజెర్సీలోని నెవాక్ విమానాశ్రయం నుంచి 300 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా స్వీడన్‌లో దీనిని దింపేశారు. అయితే, పైలట్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పినట్టు అధికారులు తెలిపారు. ఆయిల్ లీక్ కావడంతో ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోయి విషయం పైలట్ గమనించారు. దీంతో అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని స్టాక్‌హోం ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అత్యవసరంగా స్టాక్‌హోమ్ విమానాశ్రయానికి తరలించారని వివరించారు. పైలట్ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ వర్గాలు పెద్ద సంఖ్యలో ఫైరింజన్లను సిద్ధం చేశాయి. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.