హైదరాబాద్: ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవుల షెడ్యూల్‌ను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. వేసవి సెలవుల తర్వాత తిరిగి పాఠశాలలు జూన్ 12న తెరుచుకుంటాయి. ఇక పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు కొనసాగుతాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్టా మార్చి రెండవ వారం నుంచి పాఠశాలలు సగం పూటే నడుస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొన్ని పాఠశాలల్లో వేసవి సెలవులు ఎక్కువ రోజులు ఉంటే, మరికొన్ని పాఠశాలల్లో తక్కువ రోజులు ఉండడం పరిపాటి.