AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐసీయూలోనే వధువుకు తాళి కట్టిన వరుడు

మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎక్కడ జరగని సంఘటన మంచిర్యాల పట్టణంలో జరిగింది. పెండ్లి పీఠలపై జరగాల్సిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది. శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు. పెండ్లి మండపం లేదు. భాజా భజంత్రీలు లేవు. కుటుంబసభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు. నిరాడంబరంగా ఆసుపత్రిలో ఈ పెళ్లి జరిగింది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంకు చెందిన బానోథ్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయం అయింది. గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతికి తెలియడంతో కంగారుపడ్డాడు. ఇరు కుటుంబాలు పేదరికంలో ఉండడంతో మళ్లీ పెండ్లి ఏర్పాట్లు చేయడం అంటే ఖర్చు అవుతుందని భావించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10