AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒకే హోటల్‌లో గిల్‌- సారా

వైరల్‌ అవుతున్న ఫొటో
ముంబయి: మాజీ క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ హాట్‌ టాపిక్‌గా మారారు. ఇందుకు కారణం గిల్‌, సారా ఒకే హోటల్‌లో దిగిన ఫొటోలు వైరల్‌ కావడమే.. టీమ్‌ ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌లో ఉందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతున్న విషయం విదితమే. కొన్ని రోజుల నుంచి గిల్‌, సారా సామాజిక మాద్యమాల్లో ఒకరి పోస్టులకు మరొకరు రియాక్ట్‌ అవుతున్నారు. క్రికెటర్‌ గిల్‌ వన్డేలో డబుల్‌ సెంచరీ చేసిన తరువాత ఆయన ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. గిల్‌కు అభిమానులు కూడా పెరిగిపోయారు.

గిల్‌-సారా కలిసిన ఫొటోలు ఇప్పటివరకు బయటకు రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులను మరొకరు లైక్‌ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇద్దరు మధ్య ప్రేమ నడుస్తోందని సోషల్‌ మీడియాలో జోరుగా వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో సారా, గిల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఫొటోలు ఒకే విదంగా ఉండడంతో ఇద్దరు కలిశారని అనే మాటలు వైరల్‌గా మారాయి. రెండు సంవత్సరాల క్రితం ఓ హోటల్‌లో ఫొటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సారా షేర్‌ చేసింది. గిల్‌ కూడా తాజాగా అదే హోటల్‌ నుంచి ఫొటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇద్దరు కలుసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10