ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాదంపై స్పందించిన ప్రభుత్వం
కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఐఏఎస్ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ రూపా మౌద్గల్ మధ్య రెండు రోజులుగా జరుగుతున్న వీధి పోరాటానికి ప్రభుత్వం తెరదించింది. రెండు రోజులుగా రోహిణిపై రూపా సోషల్ మీడియా వేదికగా ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రోహిణి కూడా ప్రత్యారోపణలు చేశారు. రూప మానసిక వైద్యం చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఫొటోలు పంపాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇద్దరు మహిళా అధికారులపై వీధిపోరుపై ప్రభుత్వ స్థాయిలోనూ నిరసన వ్యక్తమైంది. దీంతో వారిద్దరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ సోమవారం విధానసౌదకు వేర్వేరుగా పిలిపించి వివరణ తీసుకున్నారు. ఇకపై నోరు మెదపరాదని ఆదేశించినట్లు సమాచారం. రోహిణి సింధూరి, రూపకు ఏ కారణం చేతనైనా ప్రజలకు, సోషల్ మీడియాకు లేదా మీడియాకు ప్రకటన చేయడానికి వీల్లేకుండా పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారికి నోటీసు ఇచ్చింది. ఇద్దరు అధికారుల వాగ్వాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడిరది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎం బసవరాజ్ బొమ్మై కోరారు. నివేదిక తర్వాత ప్ర భుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాలి.
విధానసౌధలో సీఎస్ వందితా శర్మను ఐపీఎస్ రూపా మౌద్గల్ భేటీ అయిన తర్వాత మీడియా ముందుకు రాకూడదని భావించానని అయితే తనపై రోహిణి సింధూరి ఆరోపణలు చేసిన మేరకు స్పందించాల్సి వచ్చిందన్నారు రూప. రోహిణి సింధూరి అక్రమాలకు పాల్పండిరదని రూప సీఎస్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సీఎసకు వివరాలు తెలిపానని, ఆమె ఫొటోలు వ్యక్తిగతం కాదని, ఎవరు రక్షిస్తున్నారో బయటకు రావాలన్నారు. రోహిణిపై లోకాయుక్తకు చేరిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. జాలహళ్లి నివాసానికి సంబంధించి ఆస్తి పత్రంలో నమోదు చేయలేదని, తనది కాదంటే లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. సీఎస్ ను కలిసేందుకు ముందు మీడియాతో మాట్లాడుతూ గెట్ వెల్ సూన్ అంటూ రోహిణి పోస్ట్ చేశారని, డిలీట్ అయిన న్యూడ్ ఫొటోల గురించి మాట్లాడుతారా? అంటూ రూపా ఆరోపించడం మరో సంచలనమైంది. రోహిణిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు రూప ఫేస్ బుక్ లో తెలిపారు.