AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండగట్టు అంజన్న సన్నిధిలో కేసీఆర్‌

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
క్షేత్ర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌పై అధికారులకు దిశానిర్దేశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హెలికాప్టర్‌ ద్వారా పరిసరాలను పరిశీలించారు. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. సీఎంకు పూర్ణకుంభం తో అర్చకులు స్వాగతం పలికారు. అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం ఫామ్‌ హౌస్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులోని జేెఎన్‌టీయూ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు వచ్చిన సీఎంకు మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కవితతో పాటు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు.

ఇదిలా ఉంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లను మంజూరు చేసింది. క్షేత్ర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలనని ప్రభుత్వం ఆదేశించింది. దీనిక సంబంధించిన బాధ్యతలను ఆర్కిటెక్ట్‌ ఆనందసాయికి అప్పగించింది. ఈ నేపథ్యంలోనే కొండగట్టును సందర్శించి ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10