AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొడుకు కోసమే రిటైర్మెంట్‌ నిర్ణయం

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా

దుబాయి: అంతర్జాతీయ కెరీర్‌లో చివరి టోర్నమెంట్‌ ఆడుతున్న భారత టెన్నిస్‌ స్టార్‌, తెలుగుతేజం సానియా మీర్జా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడిరచింది. దుబాయి ఓపెన్‌ టెన్నిస్‌ తర్వాత సానియా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా ఓ వార్త సంస్థకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చింది. ఈ క్రమంలో కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు.. అన్ని ఆమె మాటల్లోనే..

కొడుకు ఇజాన్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాను టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాను. మరి కొన్నేళ్ల పాటు కెరీర్‌లో కొనసాగే ఫిట్‌నెస్‌ తనకు ఉంది. ఈ విషయం ఆస్ట్రేలియా ఓపెన్‌లోనే స్పష్టమైంది. అయినా ఇజాన్‌ కోసం ఆటకు వీడ్కోలు పలకాలను నిర్ణయించా. కొత్త ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతుందనే నమ్మకం ఉంది. ఇక భర్త షోయబ్‌ మాలిక్‌తో ఎలాంటి వివాదాలు లేవు. ఈ విషయంలో మీడియాలో వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. తాము ఇప్పటికీ కలిసే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటా. దీనిలో మరో విషయానికి తావులేదని సానియా మీర్జా ఆ ఇంటర్వూలో స్పష్టం చేశారు.

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అవరోధాలు, మరెన్నో ఆటంకాలు దీంతో పాటు పలు అవమానాలను ఎదుర్కొన్నాను. కెరీర్‌ ప్రారంభం నుంచే తనను వివాదాలు చుట్టుముట్టాయి. టెన్నిస్‌ ఆడే సమయంలో తాను వేసుకునే డ్రెస్‌తో సహా పలు విషయాల్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొక తప్పలేదు. మతపరమైన ఒత్తిడిలను సయితం ఎదుర్కొవాల్సి వచ్చింది. ముఖ్యంగా దుస్తుల విషయంలో తనను పలు సంస్థల నుంచి ప్రతి రోజు ఎన్నో హెచ్చరికలు వచ్చేవి. తన తల్లిదండ్రులను సయితం మత సంస్థల పెద్దలు ఈ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరికలు కూడా చేశారు. అయితే వారు మాత్రం ఈ బెదిరింపులను పట్టించుకోకుండా తనను మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంపైనే దృష్టి పెట్టారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర వేలకట్టలేనిది. అంతేగాక మీడియాతో పాటు క్రీడా సంఘాల అండ కూడా తన ఎదుగుదలకు ప్రధాన కారణం. వీరందరికి తాను సదా రుణపడి ఉంటాను అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10