AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్యారెట్ జ్యూస్ చలికాలంలో తీసుకుంటే ఇన్ని ఉపయోగాలా

క్యారెట్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనకి తెలిసిన విషయమే.. క్యారెట్ తీసుకోవడం వలన కంటి సమస్యలు అలాగే రక్తహీనత నుంచి రక్షిస్తుంది. అయితే చలికాలంలో ఈ జ్యూస్ ని తాగడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల సీజనల్ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చర్మ కేస సమస్యలేవీ ఈ కాలంలో సర్వసాధారణమైనవి అలాగే శీతాకాలంలో శరీరం చల్లగా ఉంటుంది. ఈ వాతావరణన్ని తట్టుకునే శక్తి పోషకాహారం తీసుకోవడం వలనే శరీరానికి శక్తి లభిస్తుంది. ఇక చలికాలంలో లభించే పలు రకాలైన కూరగాయలను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన పలు విధాల ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. అయితే అటువంటి కూరగాయలలో లేదా చెప్పుకో తగినది క్యారెట్. ఈ క్యారెట్ జ్యూస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం… కంటి చూపు : కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహారాన్ని నిత్యం తీసుకోవడం మంచిది.

ఎందుకనగా కంటి సమస్యలు రేచీకటి ఇలాంటి సమస్యలు మూల కారణం విటమిన్ ఏ లోపమే కాబట్టి ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన కంటి చూపుకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోగనిరోధక శక్తి : చలికాలంలో నిత్యం ఓ గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అధికమవుతుంది. అలాగే శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ డామేజ్ నుంచి కాపాడటమే కాక హానికర బ్యాక్టీరియా వైరస్ ల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది. How much should carrot juice be consumed in winter బ్లడ్ షుగర్ నియంత్రణ : బ్లడ్ షుగర్ తో ఇబ్బంది పడేవాళ్లు తరచూ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ను తగిన మొత్తంలో మెయింటెన్ అవుతూ ఉంటాయి. క్యారెట్ లో ఉండే క్యాలరీలు విటమిన్లు మినరల్స్ మధుమేహాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. గుండె జబ్బులు : క్యారెట్ జ్యూస్ లో ఉండే బీటా కెరోటిన్ గుండె జబ్బులకు దారి తీసే ప్రియురాడికల్స్ ను పోరాడడానికి చాలా ముఖ్యం. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి ఈ అలాగే పొలిట్స్ లాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కారణంగా చెడు ఈ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ జరగకుండా తగ్గిస్తుంది. చర్మ సమస్యలు : క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ అనే విటమిన్ ఏ కు సంబంధించింది. దీని యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు కణజాల పునర్నిర్మానాన్ని ప్రోత్సహిస్తే ఈ క్యారెట్ జ్యూస్ లో ఉండే అధిక ఫైబర్ మూలంగా మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10