హరిచందన్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు
గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. గవర్నర్.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఎం జగన్ గవర్నర్‌కు వీడ్కోలు పలుకుతూ ఆయన కాళ్లకు మొక్కారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ జాషువా, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వీడ్కోలు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌ను ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నాళ్లు సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆత్మీయుడు, పెద్దమనిషిగా, గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకొచ్చారని కొనియాడారు. తండ్రిలా, పెద్దలా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సంపూర్ణంగా సహకరించారన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గవర్నర్ ప్రశంసించారు. బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.. ఆయన ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్‌గా కొనసాగారు. ఏపీకి కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఆయన ఈ నెల 24న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.