AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిరంజీవిపై నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులు యువకులతో తిరుపతిలో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తాను మెగాస్టార్‌ చిరంజీవి అభిమానినని నారా లోకేష్‌ తెలిపారు. అంతేకాకుండా వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కాగానే చూశానని చెప్పారు. పనిలో పనిగా బాలా మామ (నందమూరి బాలకృష్ణ) ముద్దుల మామయ్య అని తెలిపారు. ఆయన అన్ని సినిమాలు చూశానని చెప్పారు.

అయితే తాను చిరంజీవి అభిమానినని లోకేష్‌ చెప్పడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఏపీలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో తమ వైపునకు తిప్పుకోవడానికే లోకేష్‌ ‘మెగా’ మంత్రాన్ని ప్రయోగించారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం కాపుల (బలిజ) కంచుకోట. ఇప్పటివరకు ఆ నియోజకవర్గం నుంచి గెలిచినవారిలో అత్యధికులు కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఈ నేపథ్యంలో తిరుపతిలో ముఖాముఖి నిర్వహించిన లోకేష్‌.. చిరంజీవి తన అభిమాన హీరో అని పేర్కొనడం గమనార్హం. 2009లో చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో కులాలవారీగా ఓట్లు చీలిపోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. కమ్మలు పూర్తిగా తెలుగుదేశం వైపు కాపులు పూర్తిగా జనసేన వైపు రెడ్లు వైసీపీ వైపు మోహరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 75 నియోజకవర్గాల ఫలితాలను శాసించగల స్థితిలో ఉన్న కాపులను మచ్చిక చేసుకోవడానికే లోకేష్‌.. చిరంజీవి తన అభిమాన హీరో అని ప్రకటించి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్‌ కు కూడా రాజకీయం బాగానే ఒంటబట్టిందని చర్చించుకుంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10