జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాతో డాక్టర్ మజార్ తుపాకీతో కాల్చుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నం.12లోని నివాసంలో మజార్ ఆత్మహత్యయత్నం చేశారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి (Apollo Hospital)కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మజార్ మృతి చెందారు. మృతుడు మజార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)కి సమీప బంధువు. విషయం తెలిసుకున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.
కొద్దిసేపటి క్రితం మజార్ నివాసానికి వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ దేవిస్ చేరుకున్నారు. మజార్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. మరోవైపు అపోలో ఆసుపత్రి నుంచి మజార్ మృతదేహాన్ని తరలించారు. మృతుడు బజార్ డెక్కన్ హాస్పిటల్లో వైద్యుడిగా పని చేస్తున్నట్లు గుర్తించారు.