AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టర్కీ, సిరియా దేశాల్లో మృత్యు ఘోష

16వేలకుపైగా పెరిగిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియాలో దేశాల్లో ఎటు చూసినా మృత్యు ఘోషే.. భూ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య 16000కుపైగా పెరిగింది. భూకంపం నుంచి బతికి బట్టకట్టినవారిని ఇప్పుడు అక్కడ తీవ్ర చలి బాధిస్తోంది. ఇప్పటికీ శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉండడాన్ని రెస్యూ సిబ్బంది కనుగొన్నారు. రిక్టరు స్కేలుపై 7.8గా నమోదైన భూకంపం సంభవించి ఇప్పటికే 72 గంటలు గడిచిపోయాయి. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడవలసిన స్థితి నెలకొని ఉంది.

మరోవైపు టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. భూకంపం నుంచి బతికిబయటపడ్డ వారు ఇప్పుడు తిండి, ఆశ్రయం కోసం వెంపర్లాడుతున్నారు. నిస్సహాయంగా తమ బంధువులను సాయం కోరుతున్నారు. చాలా మంది శిథిలాల కింద చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రెస్కూవర్లు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

వేలాది మంది కారుల్లో, టెంట్లలో గడుపుతున్నారు. 12,873 మంది టర్కీలో, 3162 మంది సిరియాలో చనిపోయారని అధికారులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ సాయం సేకరించేందుకు యూరొప్‌ యూనియన్‌ బ్రస్సెల్స్‌లో డోనర్స్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటుచేసింది. ‘మేము సాయం కోసం పరుగులు పెడుతున్నాం’ అని యూరొప్‌ యూనియన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ ట్వీట్‌ చేశారు. ఐక్యరాజ్య సమితి అధికారులు కూడా సాహాయకార్యక్రమంలో నిమగ్నమయ్యారు. భారత్‌తో పాటు అమెరికా, చైనా, గల్ఫ్‌ దేశాలు కూడా సాయపడుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10