జైనథ్: ప్రమాదకరంగా మారిన జైనథ్ మండలం తరోడ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని బిజెపి నాయకులు కంది శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే జోగు రామన్న కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రిడ్జ్ ప్రమాద స్థితిలో ఉన్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రాణ నష్టం జరగకముందే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తరోడ వద్ద వంతెన కుంగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురువుతున్నారని అన్నారు. పైగా బ్రిడ్జిపై పగుళ్లు సైతం ఏర్పడ్డాయన్నారు. గతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని కంది శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. కొత్త వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానికులతో కంది శ్రీనివాసరెడ్డి బైఠాయించారు. ఆయనతోపాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.