తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా పుష్కలంగా సాగునీరు
అలంపూర్ ఆలయాల్లో ఎమ్మెల్సీ కవిత పూజలు
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం కావాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉంటే.. దేశవ్యాప్తంగా విచిత్రమైన పరిస్థితులు, విపరీతమైన ధోరణిని అవలంబిస్తున్న తీరును చూస్తున్నామన్నారు. తెలంగాణ పథకాలు కావాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా రావాలనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి నిర్మించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అమ్మవారు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ చెప్పారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే.. ప్రతి గ్రామంలో చెరువులు బాగుండాలన్నారు. చెక్ డాముల ద్వారా రెండు కిలోమీటర్ల మేర నిల్వ ఉండేటట్లు పాలమూరులో చేశామని వెల్లడిరచారు. ఒకప్పుడు పాలమూరు నుంచి వలసలు వెళ్లేవాళ్ళమని… ఇప్పుడు ఇదే పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాదయాత్ర వల్ల అప్పటి సమస్యలను గుర్తించి ఆర్డీఎస్ శాశ్వత పరిష్కారం కోసం తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా సాగునీటిని పరిష్కరించుకున్నామన్నారు. కృష్ణ తుంగభద్ర కలయిక ప్రాంతమైన నడిగడ్డలో తాగునీటికి కటకట ఉండేదన్నారు. నేటి మిషన్ భగీరథ ద్వారా చివరి గ్రామాలకు తాగునీరు పుష్కలంగా అందుతుందని తెలిపారు. ప్రసాద్ స్కీం ద్వారా రూ.50 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నాయి.