ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ ఎంపీ వివేక్ సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో త్వరలో కవిత అరెస్ట్ అవుతారంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నారని, తెలంగాణలో దోచుకున్న డబ్బులతోనే దేశమంతా తిరుగుతున్నారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తరహాలోనే కవిత అరెస్ట్ అవుతారని వ్యాఖ్యానించారు.
సోమవారం తిరుమల శ్రీవారిని వివేక్ దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో మీడియాతో మాట్లాడియన ఆయన.. త్వరలో కవిత అరెస్ట్ అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సష్టిస్తోన్నాయి. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అవుతారంటూ ఎప్పటినుంచో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచిన క్రమంలో మరోసారి కవిత అరెస్ట్ అవుతారంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్‌లోకి తీసుకుంది. ఆయనను గత కొద్దిరోజులుగా సీబీఐ ప్రశ్నిస్తోంది.
ఈ క్రమంలో ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఐదు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ.. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వైద్య పరీక్ష అనంతరం నేడు ఆయనను కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది. సిసోడియా అరెస్ట్‌తో నెక్ట్స్ టార్గెట్ కవితనే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కవితను సీబీఐ ప్రశ్నించింది. నిందితుల రిమాండ్ రిపోర్టులు, ఛార్జిషీట్లలో కవిత పాత్రను ప్రస్తావించారు. దీంతో కవిత అరెస్ట్ కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది.