AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా కొడుకు ఒక్కడే హత్య చేయలేడు..

అమ్మాయిని విచారించాలి: హరహరికృష్ణ తండ్రి
ప్రియురాలు తనకు దూరం అవుతుందని భావించి ప్రాణ స్నేహితుడిని దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కుమారుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని, చిన్ననాటి నుంచి ఎవ్వరినీ కనీసం కొట్టను కూడా కొట్టి ఎరగడని హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్‌ చెబుతున్నారు. ఆ అమ్మాయిని కూడా విచారించాలని కోరుతున్నారు. హత్యలో మరి కొందరి ప్రమేయం ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో ప్రాణ స్నేహితుడైన హరిహరకృష్ణే అతణ్ని హతమార్చినట్లు తేలింది. తల, మొండెంను వేరు చేయడంతో పాటు.. గుండెను సైతం బయటకు తీసిన తీరును బట్టి… నవీన్‌ పట్ల అతడు ఎంత పగ పెంచుకున్నాడో అర్థమవుతోంది.

నవీన్‌ తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతున్నట్లు హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్‌ తెలిపారు. తన కొడుకు ఏం చేశాడో అర్థం కావడం లేదన్నారు. హరిహరకృష్ణ తన చిన్ననాటి నుంచి కనీసం ఎవరినీ కొట్టలేదని.. చదువులో ముందుండే వాడని ఆయన తెలిపారు. తన కొడుకుది క్రూర మనస్తత్వం కాదని ఆయన చెప్పారు. ఆయన హన్మకొండ జిల్లా కరీమాబాద్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ హత్య ఒక్కరు చేసింది కాదని ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. తన కొడుక్కి ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. హరిహరకృష్ణ స్నేహితులతో కలిసి 5 నెలల కిందట రూమ్‌ తీసుకున్నాడని.. అందులో 7 – 8 మంది ఉండి చదువుకుంటున్నారని ప్రభాకర్‌ తెలిపారు. సోదరి ఇల్లు ఉండగా.. రూమ్‌ ఎందుకు తీసుకున్నావని అడిగితే, అందరం కలిసి చదువుకుంటున్నామని చెప్పాడన్నారు. ఈ హత్య ఒక్కరు చేసింది కాదని.. ఆ అమ్మాయిని కూడా విచారించాలని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నవీన్‌, హరిహరకృష్ణ మంచి స్నేహితులన్న ఆయన.. తాను హైదరాబాద్‌ వెళ్లినప్పుడు దిల్‌సుఖ్‌నగర్‌ వరకు వచ్చి బస్సు ఎక్కించేవారని చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10