AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా సత్తా ఎంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు
హైదరాబాద్‌: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఎంఐఎం పార్టీపై కూడా విమర్శలు చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏందో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానన్నారు. దమ్ముంటే దుబ్బాకకు రావాలని మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం 50 కాదు.. 119 సీట్లలో పోటీ చేయాలన్నారు. 15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్‌ఎస్‌ కింద పనిచేస్తానని అక్బర్‌ అనటం సిగ్గుచేటన్నారు. అక్బర్‌, కేసీఆర్‌, బీహార్‌కు సంబంధించిన వ్యక్తేమో అన్న అనుమానం వస్తోందన్నారు. రాష్ట్రంలో బీహార్‌కు చెందిన అధికారులను తెలంగాణ సీఎస్‌, డీజీపీగా సీఎం కేసీఆర్‌ నియమించారని విమర్శించారు.

93 మంది ఐపీఎస్‌ బదిలీల్లో తెలంగాణ ఐపీఎస్‌ అధికారులకు ఒక్కరికి కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టు ఇవ్వలేదని రఘునందనరావు ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని.. గట్టిగా మాట్లాడే విపక్షాల నేతలను అరెస్టు చేసేందుకు మంచి పోస్ట్‌ ఇచ్చారన్నారు. స్టీఫెన్‌ రవీంద్ర తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న వారిని రబ్బరు బుల్లెట్లతో కాల్చిన వ్యక్తి అని అన్నారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ బీహార్‌ వ్యక్తి అని.. ఆంధ్రా వాళ్ళు అంటే కాదని తాము వాదించామన్నారు. కాని ఇప్పుడు తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అసెంబ్లీలో తమకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాను వకీల్‌ సాబ్‌ నే.. తెలంగాణ ఉద్యమంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యమ కారుల కోసం పనిచేసిన వ్యక్తినని అన్నారు. తెలంగాణ మొత్తం ‘మా కుటుంబం అని చెప్పుకునే కేటీఆర్‌ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకుంటలేరు’ అని ప్రశ్నించారు. పోలీసు కిష్టయ్య, డీఎస్పీ నళినిలు, శ్రీకాంతాచారి కుటుంబం తెలంగాణ కుటుంబం కాదా అని ఎమ్మెల్యే రఘునందనరావు నిలదీశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10