AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను జబర్దస్త్ మానేయడానికి కారణం కొత్త యాంకర్ సౌమ్యనే..

హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఆ మధ్య జబర్దస్త్ నుంచి తప్పుకొని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది.

అనసూయ వెళ్లిపోయాక కొత్త యాంకర్ సౌమ్య వచ్చేంత వరకు జబర్దస్త్ లో ఉన్నాడు హైపర్ ఆది. కొత్త యాంకర్ సౌమ్య వచ్చిన తర్వాత కూడా మూడు నాలుగు ఎపిసోడ్స్ చేసిన ఆది.. ఆ తర్వాత జబర్దస్త్ ను మానేశాడు. అయితే.. ఇంత సడెన్ గా హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్ ను ఎందుకు మానేసినట్టు అని జబర్దస్త్ అభిమానులు అనుకున్నారు. కానీ.. అసలు హైపర్ ఆది ఎందుకు జబర్దస్త్ మానేశాడో చెప్పేశాడు.

తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో అసలు విషయాలు వెల్లడించాడు హైపర్ ఆది. సంక్రాంతి కానుకగా రానున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఆ షోలోనే తను ఎందుకు జబర్దస్త్ మానేశాడో చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. జబర్దస్త్ కు కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్య వల్లనే తాను జబర్దస్త్ ను మానేశానని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో భాగంగా.. హైపర్ ఆది పెదరాయుడు గెటప్ వేశాడు. అయితే.. ఆ తర్వాత హైపర్ ఆదిని రష్మి కొన్ని ప్రశ్నలు వేసింది.

వాటికి ఆది కూడా సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత నువ్వు జబర్దస్త్ మానేయడానికి ఈ ముగ్గురిలో ఎవరు కారణం అంటూ రష్మీ.. మూడు ఫోటోలు చూపించింది. అందులో యాంకర్ సౌమ్య రావు కారణం అంటూ చెప్పేశాడు ఆది. నేను జబర్దస్త్ మానేయడానికి కారణం ఈమె అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. దీంతో జడ్జి ఇంద్రజతో పాటు అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అయితే.. దానితో ప్రోమో ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. అది తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10