భర్త పట్టుకొని ఊరేగించించిన వైనం..
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారి తప్పారు. వివాహేతర సంబంధంతో గురువు స్థానానికే కళంకం తెచ్చిపెట్టారు. అందరికి ఆదర్శంగా ఉండి నీతులు చెప్పాల్సిన పంతులమ్మ, పంతులయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పంతులమ్మ తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వారిని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుక్ను సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. మంగ పేట మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నాగేందర్ అనే ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో ఓ పంతులమ్మ పని చేస్తుంది. వీరి పరిచయంగా అక్రమ సంబంధానికి దారి తీసింది. పంతులమ్మ భర్త ఓ పోలీస్ స్టేష¯Œ లో ఎఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వీళ్ల అక్రమ సంబంధం అతడికి తెలియడంతో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. పంతులమ్మను మంగపేట నుంచి బెస్తగూడెం పాఠశాలకు ట్రా¯Œ ్సఫర్ చేశారు.
భర్తకు తెలిసిన కూడా ఆమె మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. ఏకంగా ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని వివాహేతర సంబంధం కొనసాగించేది. శివరాత్రి సందర్భంగా ఆదివారం వేములవాడలో సదరు కానిస్టేబుల్ విధులు నిర్వహించాడు. సోమవారం సెలవు కావడంతో తన భార్య, కుమార్తెను చూసేందుకు మంగపేటకు వెళ్లాడు. అదే సమయంలో ఉపాధ్యాయుడు పంతులమ్మకు ఫోన్ చేసి రాత్రి వస్తున్నానని కాల్ చేసి పెట్టేశాడు. ఆ ఫోన్ కాల్‌ను భర్త లిఫ్ట్ చేయడంతో మాట్లాడకుండా ఉండిపోయాడు. రాత్రి ఉపాధ్యాయుడు వచ్చేసరికి మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. అనంతరం బాత్రూమ్‌లో దాక్కున్నాడు. ఉపాధ్యాయుడు ఇంట్లోకి వెళ్లగాను డోర్ లాక్ చేసి పోలీసులు, స్థానికులకు సమాచారం ఇచ్చాడు. భార్యతో పాటు సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి ఊరేగింపు చేసి పోలీసులకు అప్పగించాడు. వివాహేతర సంబంధం రెండు కుటుంబాల పరువు తీసింది.