జాతీయ పార్టీ.. దేశవ్యాప్తంగా పార్టీ విస్తర్ణ.. ప్రధాని పదవి.. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచనలన్నీ ఇవే. త్వరలోనే ప్రధాని కాబోతున్నట్లుల సొంత పార్టీ నేతలతో ఊకదంపుడు ప్రచారం. కానీ ఇండియాటుడే ప్రధాని పదవికి తగిన ప్రతిపక్ష నేత అనే ప్రశ్నపై జాతీయ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు(మూడ్ ఆఫ్ ది నేషన్) కేసీయార్ పేరు అసలు కనిపించనేలేదు. అదేమంటే..? అసలు తనను ఓ కంటెండర్‌గా భావించి, లిస్టులో పెడితే కదా జనం అభిప్రాయం తెలిసేది. బీఆర్‌ఎస్ పార్టీ పేరుతో ఇంత హంగామా చేస్తున్నా ఇండియాటుడే కేసీఆర్‌ను అసలు సోదిలో లేకుండా తీసిపారేయడం ఏమిటి..? కేజ్రీవాల్, మమతకన్నా ఏం తక్కువ అంటే.. ఇండియా టుడూ మీడియా సంస్థ ఎడిటోరియల్ వింగ్ అలా ఫీలైంది మరి. నో.. నో.. ఇండియాటుడే వాళ్లు అప్పుడప్పుడూ నమస్తే తెలంగాణ పత్రికతోపాటు నమస్తేప్రభ, నమస్తే సాక్షి కూడా చదవాలి కదా, లేకపోతే కేసీయార్ హల్‌చల్, జోరు వాళ్లకు ఎలా అర్థమవుతాయని ఓ జోక్. పాపులర్ సీఎంల జాబితాలోనూ పత్తాలేడు.. నిజంగానే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు కేసీఆర్‌పై దేశం అభిప్రాయం ఏమిటో సూచనప్రాయంగానైనా అర్థం అవుతుంది.
వాళ్లు మోస్ట్ పాపులర్ సీఎం అనే విభాగంలో సర్వే చేస్తే టాప్ టెన్‌లో కూడా కేసీఆర్ లేడు. ఇందులో ఫస్ట్ ప్లేసు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ది. అక్షరాలా ఆయన అర్హుడు కూడా. ఇక సెకండ్ ప్లేస్ అరవింద్ కేజ్రీవాల్. ఈమధ్య తరచూ వార్తల్లో నిలబడుతున్న అస్సోం సీఎం హిమంతబిశ్వశర్మ మూడో ప్లేసు, తరువాత స్థానాల్లో చత్తీస్‌గఢ సీఎం భూపేష్ భఘెల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ం చివరి టాప్ టెన్‌ప్లేసులో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి, జాతీయ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్లు ఎక్కడా కనిపించలేదు. జాతీయ స్థాయిలో ఉత్తముడు ఎవరంటే.. పై ఫలితాలన్నీ ఆయా రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా వచ్చినవి. ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని జాతీయ స్థాయిలో అందరినీ ప్రశ్నిస్తే డిఫరెంట్ రిజల్ట్ కనిపించింది. ఫస్ట్ ప్లేస్‌లో యోగి, సెకండ్ కేజ్రీవాల్ నిలిచారు. తరువాత వరుసగా మమతాబెనర్జీ, స్టాలిన్, నవీన్ పట్నాయక్, హిమంత బిశ్వశర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఏకనాథ్‌షిండే, జగన్‌మోహన్‌రెడ్డి, భూపేష్ భఘెల్ ఉన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ జాడలేదు. యోగి టాప్ వన్ పొజిషన్‌లో ఉన్నారు.