AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలీసులు కొట్టారని విద్యుత్‌ స్తంభం ఎక్కి..

మెదక్‌: ఖదీర్‌ ఖాన్‌ ఘటన మరువకముందే మెదక్‌ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అకారణంగా తనపై చేయి చేసుకున్నారని అవమానభారంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్లు పట్టుకొని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా చిన్నశంకరం పేట మండలం ఎస్‌ కొండాపూర్‌ గ్రామానికి చెందిన సాయిరాం వ్యక్తిగత పనినిమిత్తం తన ద్విచక్రవాహంపై బయటకు వెళ్లాడు.

వెల్దురి మండలం లింగాపూర్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సాయిరాం ద్విచక్రవాహన్ని ఆపారు. ఈ క్రమంలో సాయిరాంకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఏఎస్‌ఐ సాయిరాంపై చేయి చేసుకున్నాడు. తనను ఎందుకు కొట్టారో చెప్పాలంటూ సాయిరాం పోలీసులతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. తనను పోలీసులు కొట్టడాన్ని అవమానంగా భావించి సమీపంలోని విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కాడు. పోలీసులు వద్దని వారిస్తున్నా వినకుండా విద్యుత్‌ తీగలు పట్టుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన సాయింరాం కింద పడిపోయాడు. అతడిని పోలీసులు ఆటోలో తుఫ్రాను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వెల్లడిరచారు.

ఈ ఘటనతో పోలీసుల తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఖదీర్‌ ఖాన్‌ ఘటన మరవక ముందే సాయిరాం ఉదంతం వెలుగులోకి రావటంతో ప్రజలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10