హైదరాబాద్: రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. యువకుడిని కానిస్టేబుల్ రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శభాష్.. రాజశేఖర్ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇటు కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర… కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు. రాజశేఖర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్ , శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసనాయుడు , రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇ¯Œ స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలపై కానిస్టేబుల్ రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే…
ఈరోజు ఉదయం ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంఘర్ చౌరస్తా వద్ద ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేష¯Œ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ పరుగున అక్కడకు చేరుకున్నాడు. అయితే అప్పటికే యువకుడి గుండె కొట్టుకోవడం ఆగినట్టు గుర్తించిన కానిస్టేబుల్ ఎంతో సమయస్ఫూర్తితో సీపీఆర్ చేశారు. కానిస్టేబుల్ అప్రమత్తతో యువకుడి ప్రాణం నిలిచింది. సీపీఆర్ చేసిన వెంటనే యువకుడు తిరిగి ఊపిరితీసుకున్నాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంటనే అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం యువకుడు క్షేమంగా ఉన్నాడు. కాగా యువకుడు పడిపోయిన వెంటనే ఎంతో సమయస్పూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన కానిస్టేబుల్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.