స్వగ్రామంలో ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు
జనగామ: మెడికో ప్రీతి అంత్యక్రియలు·స్వగ్రామంలో ముగిశాయి. అశృనయనాల మధ్య ప్రీతికి కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రీతి మృతితో గిర్నితండా కన్నీటి సంద్రంగా మారింది. కాగా… ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. విపక్ష నేతలను అంత్యక్రియల్లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియల్లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపై గొడవ సర్దుమణిగింది. మందకృష్ణ మాదిగ, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పాడె పట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
కాగా… వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతి కథ విషాదంగా ముగిసింది. ఐదు రోజులుగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి లో మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాన విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.