బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రీతిది లవ్ జిహాదీ కేసు అని, అమ్మాయిలను వేధించినందుకు విదేశాల నుంచి భారీగా నిధులు కూడా వస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వేధింపులకు పాల్పడిన వారి విషయంలో ఉదారత చూపుతున్న పోలీసులు.. అమ్మాయి కుటుంబసభ్యలుపై చూపకపోవడం దారుణమని విమర్శించారు. తూతూ మంత్రంగా కేసులు పెట్టి నిందితుడిని రక్షించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ర్యాగింగ్ భూతమే కారణమని బండి సంజయ్ తెలిపారు. గత కొద్దిరోజులుగా ప్రీతి వేధిస్తున్నారని, దీనిని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర చేస్తున్నారన్నారు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ఇతర దేశాల నుంచి డబ్బులొస్తున్నాయన్నారు. లవ్ జిహాదీ పేరిట అమ్మాయిలను వేధిస్తున్నారని, తూతూ మంత్రంగా కేసులు పెట్టి నిందితుడిని రక్షించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారన్నారు. ప్రీతి ఘటనతో పాటు అంబర్‌పేటలో కుక్కల దాడిలో చిన్నారి చనిపోయిన విషయంపై ఇప్పటివరకు కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటు అంటూ బండి సంజయ్ విమర్శించారు.