AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రీతి హెల్త్‌పై లేటెస్ట్‌ అప్‌డేట్‌..

అత్యంత విషమంగానే ఆరోగ్యం
హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు

కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థిని ప్రీతి హెల్త్‌ బులిటిన్‌ ను నిమ్స్‌ వైద్యులు విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గా ఉందని, నిపుణులైన వైద్య బృందం ప్రీతిని నిశితంగా పరిశీలిస్తోందని, ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటిన్‌లో పేర్కొన్నారు.

ఎక్మోపైనే ప్రీతికి చికిత్స అందిస్తున్నామని, ఆమె శరీరం చికిత్సకు స్పందిస్తోందని నిమ్స్‌ వైద్యులు స్పష్టం చేశారు. ప్రీతి శ్వాస తీసుకోలేకపోవడంతో ఎక్మో అమర్చినట్లు తెలిపారు. ప్రీతికి ఐదుగురు డాక్టర్ల బందం వైద్య చికిత్స అందిస్తోందని, అందులో అనస్తీపియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్లు ఉన్నారని నిమ్స్‌ వైద్యులు చెప్పారు.

నిమ్స్‌ దగ్గర విద్యార్థి, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల ఆందోళనలతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా భారీగా పోలీస్‌ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రీతిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ప్రీతి కుటుంబసభ్యులు భరోసా కల్పించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10