AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బడ్జెట్‌ బృహత్తరం.. రాష్ట్రం సంక్షేమ పథం

రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు కిశోర్‌గౌడ్‌ హర్షం

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో విద్య, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయడంపై రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు కె.కిశోర్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’ పథకంతో విద్యావ్యవస్థలో నూతనోత్తేజం కనిపిస్తున్నదన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందన్నారు. పాఠశాల విద్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల వసతులు కల్పిస్తున్నదన్నారు.

సీఎం కేసీఆర్‌ దార్శనికతతో దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ కళాశాలలను ఏర్పర్చుకున్నామన్నారు. పేదలకు, అణగారిన వర్గాలకు ఉచితమైన, నాణ్యమైన విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్‌ విద్యారంగంలోనూ సృజనాత్మక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలు, వేలాది హాస్టళ్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంతంగా నిర్వహిస్తున్నదని, వాటిలో విద్యనభ్యసించే విద్యార్థినీ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుండటం మనందరికీ ఎంతో గర్వకారణమని కిశోర్‌ గౌడ్‌ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ లో విద్యారంగానికి రూ.19,023 కోట్లు, సంక్షేమరంగానికి ప్రాధాన్యతనిస్తూ బీసీ సంక్షేమ శాఖకు రూ.6,220 కోట్లు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ కు కిశోర్‌ గౌడ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10