ఉమెన్ కమిషన్ ఎదుట హాజరుకానున్న కౌశిక్‌రెడ్డి..
హైదరాబాద్: తెలంగాణ ప్రథమ పౌరురాలు.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై పై అవమానకర వ్యాఖ్యల ఆరోపణ నేపథ్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకాబోతున్నారు. విచారణకు రాకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. గత నెల 27వ తేదీన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్‌ను అవమానకర రీతిలో కామెంట్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకొని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. ఇంతకీ.. కౌశిక్‌రెడ్డి ఏమన్నారో అందరికి తెలిసిందే.
అయితే, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యాలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చింది. ఇవాళ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు కౌశిక్‌రెడ్డిపై సరూర్‌నగర్‌లో పీఎస్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. మహిళా గవర్నర్‌పై అవమానకర వ్యాఖ్యలకు కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే, అటు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి మాత్రం తానూ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదంటున్నారు. అది తెలంగాణలో సాధారణంగా వాడే పదాలని చెప్పారు. ఒక్క పదాన్ని కాదు.. మొత్తం విషయాన్ని విని అర్థం చేసుకోవాలన్నారు. తానూ చేసిన వ్యాఖ్యలు తప్పయితే.. కవితపై ఎంపీ అరవింద్ కామెంట్స్‌కి ఉమెన్ కమిషన్ ఎందుకు స్పందించలేదని కౌశిక్ ప్రశ్నించారు. అరవింద్, బండి సంజయ్ మాట్లాడిన వీడియోలతో కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఉమెన్ కమిషన్ ముందు హాజరై చట్ట ప్రకారంగానే ఎదుర్కొంటానన్నారు కౌశిక్‌రెడ్డి.