ప్రాణత్యాగానికైనా సిద్ధం’
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్‌లు చేశారు. అయితే బెదిరింపుల మెసేజ్ పై రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు భయపడేది లేదని.. ధర్మం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం కావాలని గోషామహల్ ఎమ్మెల్యే తెలిపారు. బెదిరింపు కాల్స్, మెసేజ్‌లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన డీజీపీ పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్స్ మూవ్‌మెంట్ గురించి తెలుసుకోవటం కోసం ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూం నిర్మించిందని తెలిపారు. ‘‘ఎమ్మెల్యేనైన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఎంఐఎం ఒత్తిడి వలనే బెదిరింపు కాల్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాతబస్తీ ఉగ్రవాదుల కు ఎంఐఎం ఆర్థికసాయం చేస్తోందని ఆరోపించారు. టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తే.. ధర్నాలు చేసిన చరిత్ర ఎంఐఎంకు ఉందన్నారు. తనకు బెదిరింపు మెసేజ్‌లు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంపేస్తామంటూ నాలుగైదు రోజులుగా వరుస మెసేజ్‌లు వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు.