వరంగల్ కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల బంద్‌కు ఏబీవీపీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తు్న్నారు. విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ధారావత్ ప్రీతి కథ విషాదాంతమైంది. ఐదు రోజలుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో చేస్తున్న పోరాటంలో ప్రీతి ఓడిపోయింది. డాక్టర్ల బృందం చివరి నిమిషం వరకు ఎంత ప్రయ త్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం ఆమె కన్నుమూసింది. ప్రీతి మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్తతో కేఎంసీలోని వైద్య విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంజీఎం ఆస్పత్రిలోనూ సీనియర్ డాక్టర్లు, పీజీలు, హౌస్‌సర్జన్లు సైతం విషాదంలో మునిగిపోయారు. అయితే.. నేటి తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తైన వెంటనే ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం..మొండ్రాయి గిర్నితండాకి తరలించారు. మరికాసేపట్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.