ఏప్రిల్ 14న విడుదల
అధికారికంగా కొత్త తేదీ ప్రకటన
సినీనటి సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేశారు. ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత.. ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా వరుసగా సినిమాలను చేస్తూ తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్‌ను, మార్కేట్‌ను ఏర్పరచుకున్నారు. ఆమె తాజాగా నటించిన సినిమా యశోద. ఈ సినిమా 2022 నవంబర్ 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సమంత నటిస్తోన్న మరో భారీ సినిమా శాకుంతలం. పౌరాణికం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా మొదట 2022 నవంబర్ 4న వెండితెరపైకి రాబోతుందని ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ప్రోడ్యూసర్స్. ఇక లేటెస్ట్‌గా ఈసినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి.. మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించింది టీమ్. ఈ సినిమా ఏప్రిల్ 14న వస్తున్నట్లు తెలిపుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక శాకుంతలం టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక వరుసగా ఈ సినిమా నుంచి పాటలను విడుదలచేస్తున్నారు.