AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శిథిలాల కింద శవాల గుట్టలు

తవ్వుతున్న కొద్దీ వెలుగుచూస్తున్న మృతదేహాలు
ఇప్పటికే 33వేలు దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో ఆర్తనాదాలు ఇంకా ఆగడంలేదు. శిథిలాల కింద శవాల గుట్టలు వెలుగుచూస్తునే ఉన్నాయి. వేలాది మంది చిక్కుకుపోవడంతో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపం సంభవించి వారం రోజులు గడుస్తోంది. మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజా సమాచారం మేరకు భూకంప మృతుల సంఖ్య 33 వేల 179 మంది మరణించగా సుమారు 92 వేల మంది క్షతగాత్రులుగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వారం రోజులు గడిచి పోవడంతో శిథిలాల కింద ఇరుక్కున్న వారు ప్రాణాలతో బయట పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భూకంప మృతుల సంఖ్య 50 వేలకు పైగా చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారి ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో కొందరు మృత్యుంజయులుగా తిరిగొస్తున్నారు.

శిథిలాల కింద ఇరుక్కున్న 20 ఏళ్ల విద్యార్థిని వాట్పాప్ కాపాడింది. అలాగే ఓ చోట తల్లి బొడ్డు ఊడకుండా పుట్టిన ఓ చిన్నారిని సహాయ బృందం రక్షించింది. కిర్ ఖాన్ నగరంలో 88 ఏళ్లను బామ్మను తాజాగా తుర్కిష్.. జర్మనీ బృందాలు కాపాడాయి. ఇక భూకంప సమయంలో ఇద్దరు నర్సులు తమ ప్రాణాలకు తెగించి నవజాత శిశువులను కాపాడిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరోవైపు భూకంప ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేసిన 130 మంది గుత్తేదారులపై టర్కీ అధికారులు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా భూకంప పరిస్థితిని ఆసరా చేసుకుని కొందరు దోపిడీలకు పాల్పడుతుండటంతో ముఠాలను కట్టడి చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించడం శోచనీయంగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10