AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శీనన్నకు జనం జేజేలు


బీజేపీ నేత కంది శీనన్నకు నీరాజనాలు 
ఆత్మీయంగా పలకరిస్తూ.. అందరినీ ఆదరిస్తూ..
ఊరూరా పర్యటిస్తున్న బీజేపీ యువనేత కంది శ్రీనివాస్‌రెడ్డి 
రోజూ పార్టీలోకి భారీగా చేరికలు
ఆదిలాబాద్‌కు శ్రీనన్నే శ్రీరామరక్ష అంటూ జైకొడుతున్న ప్రజలు  

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ఆశాకిరణం, బీజేపీ యువనేత కంది శ్రీనివాస్‌ రెడ్డి జోరు పెంచారు. కంది శ్రీనివాస్‌ రెడ్డి ఇస్తున్న భరోసాతో బీజేపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రజా సేవా భవన్‌ వేదికగా ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలోకి జాయినయ్యారు. కంది శ్రీనివాస్‌ రెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్‌కు శ్రీరామరక్ష అని కొత్తగా చేరిన నేతలంతా స్పష్టం చేశారు. అటు అన్ని వర్గాల ప్రజలనూ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయంగా పలకరిస్తూ, ముందుకు సాగుతున్న విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

సరైన నాయకుడు లేక అల్లాడిన ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి బీజేపీ యువనేత కంది శ్రీనివాస్‌ రెడ్డి రూపంలో గట్టి నాయకుడు దొరికాడు. ప్రజా సేవా కార్యక్రమాలతో అందరికీ ఆత్మబంధువుగా మారిన కంది శ్రీనివాస్‌ రెడ్డిని జనమంతా కోరుకుంటున్నారు. శ్రీనన్న మాఅన్న అంటూ అన్నివర్గాల జనం చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలకతీతంగా కంది శ్రీనివాస్‌ రెడ్డిపై ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. అందుకే ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీవైపే చూస్తున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీకి తప్ప ఇతర పార్టీలకు స్థానం లేదంటూ ఆ పార్టీ కండువాను కప్పుకుంటున్నారు.  

ఆదిలాబాద్‌ లోని ప్రజాసేవా భవన్‌ వేదికగా బీజేపీలోకి ప్రతిరోజూ చేరికలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కు చెందిన నేతలు, క్యాడర్‌… కంది శ్రీనివాస్‌ రెడ్డికి జై కొడుతున్నారు. తాజాగా ప్రజాసేవా భవన్‌ వేదికగా  శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం దార్లొద్డి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యువనేత కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు.

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని ఆదివాసీ బిడ్డలను జోగు రామన్న అవమానించిన తీరును యువనేత కంది శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివాసీబిడ్డలకు పోడుపట్టాలు ఇప్పించలేకపోయారని మండిపడ్డారు. ఆదిలాబాద్‌ బిడ్డలను దగా చేసిన జోగు రామన్నకు.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కంది శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కంది శ్రీనివాస్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో, రాష్ట్రంలో బీజేపీ జెండానే ఎగురుతుందని, డబుల్‌ ఇంజిన్‌ రాబోతోందని  తేల్చిచెప్పారు. ఆదిలాబాద్‌ కు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని జోగు రామన్నపై జనమంతా ఆగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  తొలి అభివృద్ధి ఆదివాసీ ప్రాంతాల్లోనే జరుగుతుందని చెప్పారు. 
  
ఇలా ఓవైపు బీజేపీలోకి వచ్చే నాయకులు, కార్యకర్తలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూనే మరోవైపు నియోజకవర్గంలోనూ పర్యటిస్తూ ముందుకు సాగుతున్నారు కంది శ్రీనివాస్‌ రెడ్డి. ప్రతిరోజూ బిజీ షెడ్యూల్‌ తో సాగిపోతున్నారు. అందుకే కంది శ్రీనివాస్‌ రెడ్డిపై అన్నివర్గాల జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కంది శ్రీనన్న నిజంగానే ప్రజా నాయకుడని కీర్తిస్తున్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా ఈసారి బీజేపీ తరపున కంది శ్రీనివాస్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు.  ఈ నేపథ్యంలో విశ్లేషకులు కూడా కంది శ్రీనివాస్‌ రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఖాయమని చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10