AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సకాలంలో స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదు..

హైదరాబాద్: పీజీ విద్యార్థి ప్రీతి  ర్యాగింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… సకాలంలో కాలేజ్ యాజమాన్యం, పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు చర్య తీసుకోలేదని మండిపడ్డారు. వేధించిన వారిని మందలించి ఉంటే ఈ ఘోరం జరగేది కాదని అన్నారు.

ప్రీతి మరణం విషయంలో మట్టెవాడ పోలీస్ అధికారి, కాలేజ్ ప్రిన్సిపాల్, హెచ్.వొ.డిని నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సిట్ విచారణ జరిపించాలన్నారు. రక్షిత అనే ఇంజనీరింగ్ అమ్మాయి కూడా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ కేసులో కూడా భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండు, మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10