సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబసభ్యులను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో సాయన్న మృతి చెందిన విషయం తెలిసిందే. సాయన్న చిత్రపటానికి నివాళులు అర్పించిన షర్మిల.. అనంతరం కుటుంబసభ్యులను కలిశారు. వారి కుటుంబానికి ధైర్యం కల్పించారు. ఇటీవల అనారోగ్యంతో సాయన్న మృతి చెందారు. గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు యశోద ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. సాయన్న మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.