వరంగల్: హనుమకొండలో హై టెన్షన్ నెలకొంది. నిన్న రాత్రి టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి మీటింగ్ ముగియగానే యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్‌పై హత్యాయత్నం జరిగింది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు పవన్‌ను ఓ గల్లీలోకి తీసుకువెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడి.. రక్తపు మడుగులో పడి ఉన్న పవన్‌ను ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సీసీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పవన్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రస్తుతం పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.