AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేవర సినిమా చూస్తూ అభిమాని మృతి.. ఈ విషాదం ఎక్కడ జరిగిందంటే..

జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నటించింది . ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవరపై అభిమానుల అంచనాల భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చాయి. ఇక నేడు ( సెప్టెంబర్ 27) వరల్డ్ వైడ్ గా దేవర సినిమా రిలీజ్ అయ్యింది. నిన్నటి నుంచి అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. ఇక సినిమా కు  బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ థియేటర్ లో విషాదం నెలకొంది. సినిమా చూస్తూ ఓ అభిమాని థియేటర్ లో కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన కడపలో చోటు చేసుకుంది. కడప అప్సర థియేటర్‌లో అభిమాని సినిమా చూస్తూ కన్నుమూశాడు.  దేవర సినిమా చూస్తూ థియేటర్‌లో కుప్పకూలిపోయాడు.  స్క్రీన్‌ ముందు అభిమానం చాటుతూ ఒక్కసారి మస్తాన్‌వలి కుప్పకూలిపోయాడు. వెంటనే అతని స్నేహితులు ఆస్పత్రికి  తరలించారు. కానీ అప్పటికే చనిపోయాడని  డాక్టర్లు తెలిపారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10