AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భార్య బికినీ ధరించేందుకు ఏకంగా ఓ దీవినే కొనేసిన భర్త

నలుగురూ చూస్తారనే ఇబ్బంది కలగకుండా తన భార్య బికినీ ధరించేందుకు వీలుగా ఓ భర్త ఏకంగా ఒక ఐలాండ్‌ను కొనేశాడు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన విలాసవంతమైన జీవితాన్ని షేర్ చేసే దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ నదక్ అనే 26 ఏళ్ల మహిళ ఈ విషయాన్ని చెప్పింది. ‘‘మీరు బికినీ ధరించాలని కోరుకున్నారు… మీ మిలియనీర్ భర్త ఐలాండ్ కొనేశాడు’’ అని ఆమె పేర్కొంది. ‘‘నా భర్త బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదే’’ అనే పోస్టుపై క్యాప్షన్‌ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌదీ అల్ నదక్ ఈ వీడియోను పంచుకుంది. అయితే ఐలాండ్‌కు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించలేదు.

కాగా దంపతులు ఇద్దరూ ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణించి ఐలాండ్‌కు చేరుకున్నట్టు వీడియోలో కనిపించింది. అందమైన బీచ్, ఆహ్లాదకరమైన వాతావరణ, రాళ్లు, కొబ్బరి చెట్లు, చుట్టూ పచ్చని వాతావరణం ఈ వీడియోలో ఆకట్టుకునేలా ఉన్నాయి.

తాను ఏకాంతంగా బికినీ ధరించేందుకు ఐలాండ్‌ను కొనుగోలు చేసినట్టు ఆమె తెలిపింది. 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ లభించిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలామంది విమర్శలు గుప్పించారు. డబ్బును వృథా చేయడమేనని పలువురు పేర్కొన్నారు. ఆమె విలాసవంతమైన జీవనశైలిని చాటిచెప్పుకోవడానికి ఇదొక మార్గమని కొందరు అన్నారు.

పేదలకు డబ్బు విరాళంగా ఇవ్వండంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. అలాంటి మహిళతో మీరు బిలియనీర్ కాలేరని మరో వ్యక్తి సరదా వ్యాఖ్యలు చేశాడు. ‘‘డబ్బు ఆదా చేయడం మంచిది. పెట్టుబడిగా పెట్టండి’’ అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. కాగా 26 ఏళ్ల సౌదీ అల్ నదక్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన విలాసవంతమైన జీవితాన్ని షేర్ చేస్తుంటారు. ఆమె భర్త పేరు జమాల్ అల్ నదక్. ఆయన మిలియనీర్. వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10