హైదరాబాద్ నగర పరిధిలో వింత ఘటన చోటు చేసుకున్నది. ఆర్టీసీ డ్రైవర్‌పైకి ఓ మహిళ పామును విసిరింది. వివరాల్లోకి వెళ్లితే.. నగర పరిధిలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మత్తులో ఓ మహిళ ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించింది. అయితే, బస్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహంతో సదరు మహిళ బస్‌పైకి బీరు బాటిల్‌ని విసిరింది. దాంతో బస్సు వెనుక భాగంలో అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సును ఆపి మహిళలను పట్టుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే, ఆ మహిళ ఆగ్రహంతో బస్ డ్రైవర్ పైకి తన వద్ద ఉన్న పామును విసిరింది. దాంతో భయంతో అక్కడి నుంచి డ్రైవర్ పారిపోయాడు. ఆ తర్వాత డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మహిళ వద్ద పాము ఎక్కడిది అనేది తెలియరాలేదు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.