తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు, రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువవచ్చునని తెలిపింది.
ఈ రోజు నల్గొండ, సూర్యపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణం, తేలికాపటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అందుకే మరో రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్స్ జారీ చేసినట్టు ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం – ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు పేర్కొంది.
ఇక ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అధికారులు వెల్లడించారు.