నేడు భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీసీతారాముల కళ్యాణం జరగనుంది. కాసేపట్లో కల్యాణ మండపానికి ఊరేగింపుగా లక్ష్మణ సమేత సీతారాములు రానున్నారు. మిథిలా ప్రాంగణంలో ఉదయం10:30 నుంచి మ.12:30 వరకూ కళ్యాణోత్సవం జరగనుంది. రేపు మిథిలా ప్రాంగణంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.