పూజ గదిలో అమ్మవారి ప్రతిమ ముందు పద్మాసనంలో కూర్చొని దైవస్మరణ చేస్తోంది స్టార్ హీరోయిన్ సమంత.ఈ మేరకు ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోను షేర్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా నోట్ కూడా రాసుకొచ్చింది సామ్. నోట్ లో.. ‘కొన్నిసార్లు, ఇది మానవాతీత బలంగా తీసుకోలేం. విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. విశ్వాసం మిమ్మల్ని ప్రశాంతంగానూ ఉంచుతుంది. విశ్వాసం మీ గురువుగా, మీ స్నేహితునిగా మారుతుంది. విశ్వాసం మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది.’ అని పేర్కొంది. ప్రస్తుతం సామ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.