భువనేశ్వర్: పెళ్లి పీటల మీద పెళ్లిలు ఆగిపోయిన సంఘటనలు చాలానే చూశాము. పెళ్లిలో ఇరు కుటుంబాల సభ్యులు గొడవలు పెట్టుకోవడంతో పెళ్లిలు ఆగిన సంఘటన తరచూ చూస్తున్నాము. వరుడు, వధువు నచ్చకపోవడంతో పెళ్లిలు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. వరుడు ఫుల్లుగా మద్యం తాగొచ్చి పెళ్లి పీటలపై పడుకోవడంతో వధువు పెళ్లిని రద్దు చేసుకున్న సంఘటన అస్సాంలోని నల్బరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వరడు కారులో పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. కారులో నుంచి దిగేటప్పుడు తూలుతూ రావడంతో తీసుకొచ్చి పెళ్లి పీటలపై కూర్చొబెట్టారు. పంతులు పెళ్లి మంత్రాలు చదువుతుండగా ఇటు ఆటు ఊగుతూ వరుడు తూలిపడ్డాడు. అక్కడే పడుకోవడంతో పెళ్లికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. వధువు తరుపు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లికి అయిన ఖర్చులు ఇవ్వాలని వధువు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పెళ్లిని వధువు రద్దు చేసుకొని తన ఇంటికి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.