చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా..
లాస్ ఏంజెల్స్: 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట హాలివుడ్ పాటలను తలదన్నింది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు సాంగ్ రికార్డులు సృష్టించింది. రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ నాటునాటు పాటను పాడారు. ఈ పాటకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా.. చంద్రబోస్ పాటను రచించారు. తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. ప్రపంచ వేదికపై తెలుగు సినీ కీర్తి పతాక రెపరెపలాడింది.