న్యూఢిల్లీ: ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ డాక్యుమెంటరీ షార్ట్‌కు ఆస్కార్ 95వ అకాడమీ అవార్డులు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ‘అమోఘం! రాబోయే సంవత్సరాలలో ‘నాటు నాటు’ పాట గుర్తుండిపోతుంది. ఎంఎం. కీరవాణికి, గేయ రచయిత బోస్‌కు, ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఆస్కార్ గెలిచినందుకు భారత్ గర్విస్తోంది’ అని ట్వీట్ చేశారు.
‘ది ఎలిఫెంట్ విష్పర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఆస్కార్ గెలిచినందుకు గునీత్ మోంగియా, కార్తీకి గొన్సాల్వెస్‌కు శుభాకాంక్షలు. వారి పనితనం అమోఘం. ప్రకృతిలో సామరస్యంగా జీవులు జీవించడం అన్నది బాగా చూయించారు’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.