AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినాష్‌ను అరెస్టు చేయవద్దు: హైకోర్టు

హైదరాబాద్: వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తీవ్ర చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉంచారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ పైనా తీర్పు రిజర్వులో ఉంచారు. తీర్పు వెల్లడించే వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు సిబిఐకి సూచించింది. అవినాష్‌కు సంబంధించిన వివరాలను హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సిబిఐ ఇచ్చింది. పది డాక్యుమెంట్లు, 35 వాంగ్మూలాలు, కొన్ని ఫోటోలను సిబిఐ సమర్పించింది. అవినాష్ విచారణకు సంబంధించి ఆడియో, విడియో రికార్డు చేస్తున్నామని సిబిఐ పేర్కొంది.

సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సిబిఐ పేర్కొంది. అవినాష్‌పై తీవ్ర చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వొద్దని సిబిఐ కోరింది. అవినాష్ కనిపించేలా లాయర్‌కు అనుమతివ్వగలరా అని హైకోర్టు ప్రశ్నించింది. అవినాష్ కనిపించేలా లాయర్‌కు అనుమతిపై ప్రయత్నిస్తామని, సిబిఐ ఆఫీసు వద్ద అవినాష్ ప్రెస్‌మీట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు జరుగుతుండగా సిబిఐ ఆఫీస్ వద్ద ప్రెస్‌మీట్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సిబిఐ విచారణకు హాజరుకాకుండా అనుమతి ఇవ్వాలని అవినాష్ కోర్టును కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. సిబిఐనే కోరాలని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డికి హైకోర్టు సూచించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10