హైదరాబాద్: 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడంతో చిత్రయూనిట్ ఆనందంతో పండగ చేసుకుంటుంది. అయితే నిన్న అవార్డుల ప్రదానోత్సవం కంటే ముందు టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన రెడ్ ఆస్కార్ కార్పెట్‌పై ఫోటోలకు పోజులిచ్చారు. అనతంరం రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాతో కాపేపు ముచ్చటించారు. ఉపాసన ఇప్పుడు ఆరునెలల గర్భవతి అని చెప్పాడు. పుట్టబోయే బిడ్డకు ఎంతో ప్రేమ లభిస్తోందన్నారు. కడుపులో ఉండగానే తను మాకెంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతోందని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్ పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో కనిపించగా, ఉపాసన క్రీమ్ డిజైనర్ చీరలో మెరిసిపోయింది. ఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా, నాటు నాటు ప్రత్యక్షంగా ప్రదర్శించబడిన విషయం తెలిసిందే.