తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి ఉద్యోగ పరీక్ష పత్రాలు లీక్ కావడం పట్ల విద్యార్థులు,నిరుద్యోగులు భగ్గుమన్నారు. పేపర్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి విద్యార్ధి సంఘం, టిజెఎస్ లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను ముట్టడిరచాయి.. కార్యాలయం వద్ద భైఠాయించారు.. ఆందోళనకారులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేశారు.. గేట్లు దూకారు.. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు పోలీసులు. పలువురిని అరెస్ట్ చేశారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి . పేపర్లు లీక్ చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ భగ్గుమన్నారు స్టూడెంట్స్. ఎగ్జామ్ పేపర్లను అమ్ముకుంటూ నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతుంటే . పేపర్లు లీక్ చేసి మోసం చేస్తున్నారని న్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగులు. పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయంటూ ఆరోపించారు.. ఇంజినీరింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ తరహాలోనే.. గ్రూప్ వన్, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలను సైతం వ్యక్తం చేశారు. పరీక్షల పేపర్లును కాపాడుకోకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ఈ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉస్మానియా వర్శిటీలో కూడా విద్యార్ధులు నిరసన ఆందోళన చేపట్టారు.. వర్శిటీ రోడ్లపై బైఠాయించారు.. ఈ లీకేజ్ లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు..